
మందకొడిగా ఈ–క్రాప్
● 1.61 లక్షల ఎకరాల్లో నమోదు
● మారిన నిబంధనలతో వీఏఏల అవస్థలు
● ఈ నెలాఖరు వరకు గడువు
● నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు
కొత్తపేట: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు అవుతోంది. రైతులకు అన్ని విధాలా ఉపయోగకరమైన పంట నమోదు (ఈ–క్రాప్) మాత్రం అనుకున్నట్లు సాగడం లేదు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నాటికి 50 శాతం కూడా పంట నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వీఏఏలపై ఒత్తిడి చేస్తున్నారు. వీఏఏలకు పని ఒత్తిడి, గ్రామాలకు కొత్తవారు కావడం, ఎరువుల పంపిణీతో పాటు కొన్ని నిబంధనలు మార్చడంతో అనుకున్నట్లుగా పంట నమోదు జరగడం లేదు. రైతుల మేలు కోసం గత ప్రభుత్వం ఈ–క్రాప్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. పంట నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ వర్తింపజేసింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3,90,708 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరితో పాటు ఉద్యానవన పంటలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెల 30వ తేదీ లోగా నమోదు చేయాలి. ఇంకా కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా పూర్తి చేయాలని అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. సకాలంలో పంట నమోదు జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పంట నమోదు సక్రమంగా కాకపోతే పండిన ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు వస్తాయి. ఎరువులు సక్రమంగా ఇవ్వకపోగా ధాన్యం విక్రయానికి కూడా ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మారిన నిబంధనలతో అవస్థలు
గత ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఈ–క్రాప్ నమోదులో ఈ ఏడాది కొన్ని నిబంధనలను ప్రభుత్వం మార్చింది. గతంలో 200 మీటర్ల దూరం నుంచి ఈ–క్రాప్ నమోదుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దీనిని 20 మీటర్లకు కుదించారు. విధిగా వీఏఏలు ప్రతి కమతం దగ్గరకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. 25 సెంట్ల లోపు ఉన్న కమతాల్లో ఈ–క్రాప్ నమోదు చేసేందుకు కమతం వద్దకు వెళ్లకపోయినా ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే అయిపోయేది. ఫొటో అప్‌లోడ్ తప్పనిసరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఆప్షన్ తొలగించారు. మరోపక్క యూరియా పంపిణీలో వీఏఏలు బిజీగా ఉండటంతో. ఈ–క్రాప్ అనుకున్నంత ముందుకు సాగడం లేదు. ఈ–క్రాప్ నమోదు బాధ్యత మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ)దే. వారు వీఏఏలను సమన్వయం చేసుకుని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
ప్రయోజనాలు
D&{M>‹³ ¯]lÐðl*-§ýl$¯]l$ {糆 OÆð‡™èl* ^ólƇ$$…-^èl$MøÐé-Í. C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ, C¯ŒS-ç³#sŒæ çܼÞyîl, ç³…rÌS Ñ{MýS-Ķæ*-°MìS, A¯]l²-§é™èl çÜ$T-¿ýæÐ]l ç³£ýlM>°MìS D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ™èlç³µ-°çÜ-Ç. MúË$ OÆð‡™èl$-ÌSMýS$ {糿¶æ$™èlÓ ç³£ýl-M>Ë$ A…§éÌS¯é² ç³…r ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-Mø-Ðé-Í. hÌêÏÌZ° 22 Ð]l$…yýl-ÌêÌZÏ Ððl¬™èl¢… Ð]lÅÐ]lÝëĶæ$, E§éů]l ç³…rË$ 3,90,708 GMýSÆ>ÌS ÑïÜ¢Æý‡~…ÌZ ÝëVýS$ AÐ]l#™èl$…yýlV> D ¯ðlÌS 15Ð]l ™ól© ¯ésìæMìS 1,60,578 GMýS-Æ>ÌZÏ D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$.
త్వరితగతిన పూర్తి చేయాలి
ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ మేరకు మండల స్థాయి అధికారుల (ఏఓ) పర్యవేక్షణలో గ్రామ స్థాయిలో వీఏఏలు పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చాం. మారిన నిబంధనలకు అనుగుణంగా వీఏఏలు తమ పరిధిలోని అన్ని పంటలనూ నమోదు చేయాలి. మండల వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పంట నమోదు ప్రక్రియపై సమీక్ష చేస్తుండాలి.
– ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట

మందకొడిగా ఈ–క్రాప్