
దేవస్థానం మాజీ చైర్మన్ మృతి
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత నగరం గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ (60) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గతంలో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చైర్మన్‌గా, మామిడికుదురు సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పి.గన్నవరం నియోజకవర్గ ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.