
ఉమ్మడి జిల్లా డీఐజీగా జానకీదేవి బాధ్యతల స్వీకరణ
కాకినాడ లీగల్: ప్రస్తుత రిజిస్ట్రేషన్ విధానంలో క్రయ విక్రయదారులకు ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు జరగవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌న్ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా సీహెచ్ జానకీదేవి అన్నారు. డీఐజీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలు వల ఇబ్బందులు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుతం ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రయ విక్రయదారుల ఆధార్‌కు ఓటీపీ వచ్చిన తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎటువంటి తప్పులు జరగవన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఎటువంటి లోపాలు లేకుండా వేగవంతంగా క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఐజీగా జానకీదేవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జేఎస్‌యూ జయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణ, కోనసీమ రిజిస్ట్రార్ సీహెచ్ నాగలింగేశ్వరరావు తదితరులు కలిశారు.