
రాష్ట్ర స్థాయి హాకీ, జిమ్నాస్టిక్స్ పోటీలకు విద్యార్థు
కాకినాడలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు
రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులతో హెచ్‌ఎం మూర్తి తదితరులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు డీఎస్‌ఏలో జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీలో ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీవీఎస్‌ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 బాలికల విభాగంలో పి.సంజన, జె.జ్వాలరాజేశ్వరి, అండర్–14 బాలుర విభాగంలో బి.పవన్, సీహెచ్ రాజు, అండర్–17 బాలుర విభాగంలో గోపాల్‌సాయి, బాలికల విభాగంలో బి.కుసుమ, నాగ నందిని, అండర్–19 హాకీలో జి.స్వరూప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఎంపికయ్యారన్నారు. బుధవారం పాఠశాలో జరిగిన కార్యక్రమంలో పీడీలు వర ప్రసాద్, బి.శ్రీను, ఎంపికై న క్రీడాకారులను ఉపాధ్యాయులు రత్నప్రసాద్, విద్యార్థులు అభినందించారు.
మలికిపురం: ఈ నెల 16న కాకినాడ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో గుడిమెళ్లంక ఉన్నత పాఠశాల విద్యార్థి కోసెట్టి తనూజ్ విశేష ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అక్టోబర్‌లో కాకినాడ క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున తనూజ్ పాల్గొంటాడని హెచ్‌ఎం కె.రామకృష్ణ తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా వెయిట్‌లిఫ్టర్లు
కాకినాడ క్రైం: అండర్–19 రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 మంది వెయిట్‌లిఫ్టర్లు ఎంపికయ్యారు. కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో బుధవారం కోచ్ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60 మందిలో 19 మంది ఎంపికయ్యారు. జయసూర్య, ఎ.రాహుల్, ఐ.మణికంఠ, డి.కారుణ్యముఖేష్, బి.రిషబ్, కె.సాయిదుర్గాప్రసాద్, జి.సుబ్రహ్మణ్యం, ఎ.సహస్ర, బి.ఇందిరాప్రియాంక, హాసిని, మాధురి, సీహెచ్ శ్రీసాద్విక, ఎండీ రహం, నిషాతో పాటు అండర్–17లో ఎం.దుర్గాప్రసాద్, సీహెచ్ సంతోష్‌కుమార్, బి.గాయత్రి, ఎం.నవ్యశ్రీ ఉన్నారు.

రాష్ట్ర స్థాయి హాకీ, జిమ్నాస్టిక్స్ పోటీలకు విద్యార్థు

రాష్ట్ర స్థాయి హాకీ, జిమ్నాస్టిక్స్ పోటీలకు విద్యార్థు