
తిరుచ్చి వాహనంపై సత్యదేవుడు
● ఆదాయం రూ.40 లక్షలు
● వర్షానికి ఇబ్బంది పడిన భక్తులు
అన్నవరం: రత్నగిరి శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరుచ్చి వాహనంపై ప్రతిష్టించి వేద మంత్రాల నడుమ పూజల అనంతరం ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తిరిగి ఆలయానికి చేర్చారు. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. సర్వదర్శనానికి గంట, రూ.200 టిక్కెట్‌పై అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. శనివారం కుండపోత వర్షం పడడంతో భక్తులు అవస్థ పడ్డారు. ఆలయ ప్రాంగణంలోని గ్రీన్ నెట్ ఎండ నుంచి కాపాడుతున్నప్పటికీ వర్షం నుంచి రక్షణ కల్పించలేకపోతోంది. వర్షాకాలం నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ షామియానాలు వేయించాలని భక్తులు కోరుతున్నారు.

తిరుచ్చి వాహనంపై సత్యదేవుడు