
కళకాలం నిలిచేలా..
● డైట్‌లో కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం
● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
130 మంది విద్యార్థుల హాజరు
రాజమహేంద్రవరం రూరల్: ఎప్పుడూ పుస్తకాల్లోని పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో సత్తా చాటి శభాష్ అనిపించుకున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణసంస్థ (డైట్)లో గురువారం కళా ఉత్సవ్ 2025 పేరిట జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. గాత్రం, వాయిద్య సంగీతం, నృత్యం అంశాల్లో సోలో, గ్రూప్ విభాగాలలో పోటీలు జరిగాయి. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 35 పాఠశాలల నుంచి 130 మంది విద్యార్థులు హాజరయ్యారు.
సృజనాత్మకతకు వేదిక
ప్రారంభోత్సవంలో డైట్ ప్రిన్సిపాల్ ఆర్‌జేడీ రాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగిన సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచి వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకుడు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిపక్వతకు, మనో వికాసానికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. శుక్రవారం సోలో(2డి), సోలో(3డి), గ్రూపు (2డి/3డి), థియేటర్ ఆర్ట్స్, సంప్రదాయ కథనాలకు సంబంధించి గ్రూపు విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు.
బహుమతుల ప్రదానం
తొలిరోజు జరిగిన పోటీల్లో విజేతలకు ప్రిన్సిపాల్ ఆర్‌జేడి రాజు చేతులమీదుగా సర్టిఫికెట్లు, షీల్డ్‌లు అందజేశారు. వీరందరూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా కేటీ సుబ్బరాయన్, ఎం.నాగేశ్వరరావు, డి. రవి కిరణ్ వ్యవహరించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
● గాత్రం వ్యక్తిగత విభాగంలో కె.షర్మిల, బృంద విభాగంలో ఎన్.సుమశ్రీ, ఆర్.భారతి, ఈ.నాగజ్యోతి, కె.శిరీష (అంబేడ్కర్ గురుకులం, ఏలేశ్వరం)
● వాయిద్యం వ్యక్తిగత విభాగానికి సంబంధించి స్ట్రింగ్‌లో టీవీకే దేవీ ప్రియాంక (భాష్యం స్కూల్, కాకినాడ), పెర్కషన్‌లో కె.కార్తికేయ హిమాన్షు (కలాం జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం).
● నృత్యం వ్యక్తిగత విభాగంలో సీహెచ్ హేమసత్య (చేబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాల), బృంద విభాగంలో సీహెచ్ త్రిలోచన, పి.జ్యోతి లహరి, జి.చరణ్ సాత్విక్, ఎం.పవన్ కుమార్ (గాంధీపురం మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం).

కళకాలం నిలిచేలా..

కళకాలం నిలిచేలా..

కళకాలం నిలిచేలా..

కళకాలం నిలిచేలా..