
22 నుంచి పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు
శరన్నవరాత్ర
ఉత్సవాల
ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న
పీఠాధిపతి గాడ్
తదితరులు
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయదుర్గా పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు గురువారం విలేకరులకు తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 22న ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు ఉదయం 8.19 గంటలకు గురుహోరలో కలశస్థాపన జరుగుతుందన్నారు. పీఠంలోని కొలువైన విజయదుర్గా అమ్మవారికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నారు.
అమ్మవారు దర్శనమిస్తారిలా..
ఈ నెల 22న బాలాత్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న రజిత కవచ అలంకృత విజయదుర్గాదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలిత త్రిపుర సుందరీదేవి, 28న విజయదుర్గాదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, అక్టోబర్ ఒకటిన మహిషాసురమర్దని, 2న రాజరాజేశ్వరి అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
పీఠాధిపతి గాడ్ సమక్షంలో అడ్మినిస్ట్రేటర్ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబి తదితరులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. పీఠానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు.