
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తారా?
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తారా? ప్రజల గొంతుకగా నిలిచే శ్రీసాక్షిశ్రీ మీడియా గొంతును నులిమే ప్రయత్నాలను మేధావి వర్గం ముందుకు వచ్చి ఖండించాలి. శ్రీసాక్షిశ్రీ సంపాదకుడు ధనుంజయరెడ్డిపై ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి గానే దీనిని పరిగణించాలి. ఇదివరకు ఏ ప్రభుత్వంలోనూ ఇంతటి దారుణాలు చూడలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పింది. ప్రజలకు, పత్రికలకు భావప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఇది చాలా అన్యాయం. – వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ