
బస్సులు ఆగేలా చర్యలు
గండేపల్లి: మండలంలోని నీలాద్రిరావుపేటలో బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని ఏలేశ్వరం డిపో మేనేజర్ జీవీవీ సత్యనారయణ తెలియజేశారు. ఉచితమని నిర్లక్ష్యమా? అనే శీర్షికన శుక్రవారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురించిన కథనంపై ఆర్టీసీ అధికారులు స్పందిచారు. శుక్రవారం ఆయన గ్రామంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే ప్రదేశాన్ని, బస్సులు ఆగుతున్నాయా..లేదా..అని పరిశీలించి గ్రామ సర్పంచ్ ములంపాక సురేష్, మండల రైతు అధ్యక్షులు చిట్యాల అప్పారావు, నేదూరి త్రిమూర్తులు, చిట్యాల బాబ్జి, ప్రయాణికులతో మాట్లాడారు. రహదారికి ఇరువైపులా స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయించనున్నట్టు తెలియజేశారు. డీపీటీఓ ఎం.శ్రీనివాస్ ఆదేశాల మేరకు పరిశీలనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ట్రాన్స్‌పోర్ట్ అధికారి రుక్మిణి పాల్గొన్నారు.