
ఉత్కంఠగా చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విక్టరీ అకాడమీలో గురువారం జిల్లా స్థాయిలో చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు ఉత్కంఠగా జరిగింది. ఈ జిల్లా చెస్ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించి ర్యాపిడ్ విభాగంలో బండారు నానిబాబు ప్రథమ, ద్రాక్షారపు సాత్విక్ ద్వితీయ స్థానాలు, బ్లిట్జ్ విభాగంలో ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ, పనిశెట్టి సాయి అవినాష్ ద్వితీయ స్థానాలు సాధించారు. జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ మాట్లాడుతూ విజేతలు ఈ నెల 13 నుంచి నంద్యాలలో జరిగే రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.
రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్
పోటీలకు ఇద్దరి ఎంపిక
రావులపాలెం: రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ అండర్–19 విభాగానికి డాన్ బాస్కో హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆర్.పవన్ కుమార్, ఎ.వినయ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జె.విద్యాసాగర్ గురువారం తెలిపారు. కర్నూలులో ఈ నెల 22 నుంచి 24 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 10న జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలుర విభాగంలో జిల్లా స్థాయిలో చక్కటి ప్రతిభ చూపారన్నారు.
జూదరులకు జరిమానా
కిర్లంపూడి: పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టు జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. వారిని గురువార ంప్రత్తిపాడు కోర్టుకు హాజరు పర్చామన్నారు. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున జరిమానా విధించారన్నారు. మరోసారి పేకాట ఆడితే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉత్కంఠగా చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు