ప్లీనరీ సెషన్‌లో ‘ఆదిత్య’ సతీష్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ప్లీనరీ సెషన్‌లో ‘ఆదిత్య’ సతీష్‌ రెడ్డి

Sep 12 2025 6:27 AM | Updated on Sep 12 2025 6:27 AM

ప్లీన

ప్లీనరీ సెషన్‌లో ‘ఆదిత్య’ సతీష్‌ రెడ్డి

గండేపల్లి: న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో ఈ నెల 10న జరిగిన అఖిల భారత మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) 52వ జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్వెన్షన్‌లో నిర్వహించిన ప్లీనరీ సెషన్‌లో ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్‌ ఎన్‌.సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ ప్రో చాన్సలర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. పారిశ్రామిక, విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మేనేజ్‌మెంట్‌, వ్యాపార రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. కార్యక్రమంలో నితిన్‌ ఆట్రోలే (చీఫ్‌ స్ట్రాటజీ, కేపీఎంజీ), సంజయ్‌ కుమార్‌ సింగ్‌ (డైరెక్టర్‌, స్ట్రాటజీ, ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్‌, జిందాల్‌ స్టీల్‌ లిమిటెడ్‌), సంజయ్‌ నారాయణ్‌ (చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), తదితర ప్రముఖులు పాల్గొన్నారన్నారు.

తిరుమల విద్యాసంస్థల సిబ్బంది రక్తదానం

రాజమహేంద్రవరం రూరల్‌: తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు జన్మదినం సందర్భంగా గురువారం తిరుమల చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కాతేరులోని సంస్థ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎన్‌టీఆర్‌ ట్రస్టు, డాక్టర్‌ వైఎస్సార్‌ అండ్‌ జక్కంపూడి రామ్మోహనరావు బ్లడ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాలలో సుమారు 265 మంది తిరుమల సిబ్బంది రక్తదానం చేశారు. వారికి నున్న తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రక్తాన్ని డబ్బుతో కొనలేమని, వెల కట్టలేనిదన్నారు. ప్రపంచంలో మనిషి నుంచి మాత్రమే రక్తం లభిస్తుందన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో తిరుమలరావు సోదరులు నున్న కృష్ణ, నున్న సురేష్‌, డాక్టర్‌ జక్కంపూడి రాజశ్రీ, అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ బాలిక మృతి

అల్లవరం: దేవగుప్తం పంచాయతీ నల్లగుంటకు చెందిన బాలిక ఈ నెల ఒకటో తేదీన పురుగుమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికి బాలిక పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పది రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపారు.

ప్లీనరీ సెషన్‌లో ‘ఆదిత్య’ సతీష్‌ రెడ్డి 1
1/1

ప్లీనరీ సెషన్‌లో ‘ఆదిత్య’ సతీష్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement