
ఏటీఎస్‌లు కాదు.. ఏటీఎంలు!
ప్రస్తుతం నడుస్తున్న పనిని మరింత సులభతరం చేయడానికి తద్వారా ప్రజలకు సమయం.. ఖర్చు ఆదా.. మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆధునిక పద్ధతులు అమలుచేస్తుంటాయి. ఆ పద్ధతులు లక్ష్యాలు సాధించకపోగా మరిన్ని సమస్యలకు కారణమైతే మొదటికే మోసం వస్తుంది. రవాణాశాఖలో నేడు ఇదే జరుగుతోంది. వాహనాలకు సామర్ధ్య సర్టిఫికెట్ల జారీ వ్యవహారం ఆ శాఖకు తలనొప్పులు తీసుకురావడంతో పాటు, వాహన చోదకులకు, యజమానులకు ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తోంది. గతంలో అధికారుల పర్యవేక్షణలో స్వయంగా వాహనాన్ని పరీక్షించి ఈ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. అందులో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఏటీఎస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో నేరుగా యంత్రమే వాహనాన్ని పరీక్షించి సామర్ధ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ లక్ష్యం మంచిదే అయినప్పటికీ ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఈ పరీక్షల బాధ్యతలు అప్పగించారు. దీంతో అక్కడ ఏజెన్సీ నిర్వాహకులే సర్టిఫికెట్‌ను బట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏటీఎస్ లక్ష్యం నెరవేరడం లేదు.
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇటీవలే కాకినాడ సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు అదపుతప్పి కాల్వలోకి దూసుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఎవ్వరికీ ప్రాణనష్టం జరగకపోయినా దానికి గల కారణం ఆరాతీస్తే బ్రేకులు ఫెయిల్ అయినట్టు తెలిసింది. ఈ వాహనానికి గత జూన్ నెలలో ఏటీఏస్ సెంటర్ ద్వారా అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం. వాహనాన్ని ఎవరూ నడపకుండానే యంత్రాలతో పూర్తిస్థాయిలో పరీక్షించకుండా సర్టిఫికెట్ జారీచేశారు. ఇదే ప్రమాదానికి ఒక కారణంగా నిలుస్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా జిల్లాలో దాదాపు 1,498 పాఠశాల బస్సులు ఉండగా వీటన్నింటినీ ఈ ఒక్క ఫిట్‌నెస్ సెంటరు ద్వారానే సర్టిఫికెట్లు జారీచేశారు. ఇలా స్కూల్ బస్సులే కాకుండా లారీలు, ట్రాక్టర్లు, క్యాబ్, కార్లు, వ్యాన్లు వంటి అన్ని రకాల వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఏటీఎస్ ద్వారానే జారీ చేస్తున్నారు. అధికారుల నుంచి తప్పించి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ఇచ్చామనుకుంటే మొదటికే నష్టం వచ్చేలా కనిపిస్తోంది.
అధికారుల పర్యవేక్షణ నిల్..
వాహనాల ఫిట్‌నెస్ విధుల్లో రవాణాశాఖ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడటంతో దీనికి చెక్ పెట్టేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఏస్) తీసుకు వస్తే ఆ విధానంలో సైతం మామూళ్ల పర్వం మొదలుపెట్టేశారు. ఫిట్‌నెస్ కేంద్రాల్లో వాహనాన్ని బట్టి రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలకు పిట్‌నెస్ పరీక్షకు రూ.వెయ్యి, సర్టిఫికెట్‌కు రూ.200, సర్వీస్ ఛార్జ్ రూ.120 కలిపి రూ.1320 అన్‌లైన్‌లో చెల్లించాలి. చిన్న తరహా వాహనాలు, కార్లు, ఆటోలు వంటివి మొత్తం 860 నుంచి 920 వరకూ చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఏటీఎస్ సెంటర్లు అన్‌లైన్ ఫీజుతో సంబంధం లేకుండా భారీ వాహనాలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు, చిన్న వాహనాలకు రూ.1500 వరకూ వసూలు చేస్తున్నారు. గతంలో రవాణాశాఖ కార్యాలయం ఆధీనంలో రవాణా వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహించేవారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో ఏటీఏస్ సెంటర్ల ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది జవనరి నుంచి కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ ఏడీబీ రోడ్డులో ఏర్పాటు చేశారు. స్కూల్ బస్సులు, నాలుగు చక్రాల వాహనాలు, లారీలు వంటివి ఎంవీఐ’ (మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్)ల ఆధ్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి దాదాపు కిలోమీటర మేర డ్రైవింగ్ చేసి అన్ని సక్రమంగా ఉంటే పిట్‌నెస్ జారీ చేసేవారు. ఈ బాధ్యతల నుంచి వీరిని తప్పించి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడంతో ఏటీఎస్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందుతున్నారు. జిల్లా మొత్తానికి సేవలందించే బాధ్యతను ఒక ఏజెన్సీకు అందజేయడంతో కత్తిపూడి యూనిట్‌తో పాటు పెద్దాపురం యూనిట్‌కు సంబంధించి ఆయా మండలాల ఫరిధిలో ఉన్న వాహనాలు అన్నీ ఇక నుంచి కాకినాడ బీచ్‌రోడ్డులో ప్రైవేట్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి రావల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి వాహనాలకు ఫిట్‌నెస్ కావాలంటే వ్యయ ప్రయాసలకు గురికావడంతో పాటు సమయం ఎక్కువ వృథాకావడం ఖాయమని వాహానదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్తిపూడి పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాలు, పెద్దాపురం పరిధిలో మెట్ట గ్రామాల నుంచి కాకినాడ రావాలంటే దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్లు రావలసిన పరిస్థితి ఉంది.
కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ లోపలి భాగం
కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై గత నెలలో జరిగిన ప్రమాదంలో నుజ్జయిన ముందుభాగం
జిల్లాలో వాహనాల వివరాలు
బస్సులు 489
స్కూల్ బస్సులు 1498
గూడ్స్ క్యారియర్లు 13,546
లగ్జరీ క్యాబ్‌లు 60
మ్యాక్సీ క్యాబ్‌లు 481
మోటర్ క్యాబ్‌లు 1730
ఒమ్నీ బస్సులు 46
ప్రైవేట్ సర్వీస్ వెహికల్ 237
త్రీవీలర్ (గూడ్స్) 3483
ప్యాసింజర్ ఆటోలు 13,194
ట్రైలర్ 3491
కమర్షియల్ ట్రాక్టర్లు 912
ఫిర్యాదులు వస్తున్నాయి
ఫిట్‌నెస్ కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు బండి కండిషన్ చూసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇలా ఏటీఎస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో మా పాత్ర ఏమీలేదు. కేవలం వాహనానికి ఫిట్‌నెస్ లేకపోతే కేసు రాయడం తప్ప వాహనాన్ని తనిఖీచేసే అధికారం లేదు.
– కె.శ్రీధర్, డీటీసీ, కాకినాడ
ఉదయం నుంచి పడిగాపులు
గతంలో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు అధికారులు వాహనాన్ని నేరుగా క్షణ్ణంగా పరిశీలించి డ్రైవింగ్ చేసి బ్రేకులు అన్నీ పరీక్షించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఇప్పుడు ఈ కేంద్రానికి వస్తే టోకెన్ ఇచ్చి మమల్ని బయట ఉండమంటున్నారు. వారే వాహనం తీసుకెళ్లి మళ్లీ బయటకు ఇస్తున్నారు. వాహనంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని స్వయంగా వాహన యాజ మాని తెలుసుకోనే అవకాశం లేదు. ఒక వేళ ఫెయిల్ అని వస్తే మళ్లీ మరుసటి రోజు రావాలి. ఈ కేంద్రాల పనితీరులో సమయం చాలా వృధా అవుతుంది.
– ఆర్.రాజా, వాహన యజమాని, కాకినాడ
వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీలో చేతివాటం
అదనపు వసూళ్లకు
పాల్పడుతున్న ప్రైవేటు ఏజెన్సీ
వాహనానికి రూ.2 వేల
నుంచి రూ.3వేల వరకు
తప్పుడు సర్టిఫికెట్లతో రోడ్లపై తిరిగి ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు
ఏమీచేయలేమని చేతులెత్తేస్తున్న
రవాణాశాఖ అధికారులు

ఏటీఎస్‌లు కాదు.. ఏటీఎంలు!

ఏటీఎస్‌లు కాదు.. ఏటీఎంలు!

ఏటీఎస్‌లు కాదు.. ఏటీఎంలు!

ఏటీఎస్‌లు కాదు.. ఏటీఎంలు!