
● సముద్రుడి ఉగ్రరూపం
● తీరంలో ఎగసిపడుతున్న అలలు
● ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు ఛిద్రం
● అప్రమత్తమైన అధికార
యంత్రాంగం
● పాఠశాల ఆవరణలోకి
ప్రవేశించిన నీరు
కొత్తపల్లి: ఎటువంటి తుఫాను హెచ్చరికలు లేకపోయినా సముద్రుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. గురువారం ఉప్పాడ తీర ప్రాంతం, బీచ్ రోడ్డుపై సముద్ర కెరటాలు విరుచుకుపడ్డాయి. దీంతో తీరప్రాంతం అతలాకుతలమైంది. ఉప్పాడ శివారు ప్రాంతాలైన సూరాడ పేట, మాయాపట్నం, జగ్గరాజుపేట, పాత బజారు, పల్లిపేట, రంగంపేట, సుబ్బంపేటలపై సముద్రం కెరటాలు విరుచుకుపడుతున్నాయి. ఎగసిపడే కెరటాలతో బీచ్ రోడ్డు గోతులమయంగా మారింది. దీంతో పోలీసులు ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్‌లో ప్రయాణికుల రాకపొకలు పూర్తిగా నిలిపివేశారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగంపేటలో ఉన్న ఎంపీపీ పాఠశాలలోకి సముద్రపు నీరు చేరి మోకాలెత్తు నిలిచింది. దీంతో అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. తీరప్రాంతలో కెరటాల తాకిడికి పలు గృహాలు నేలమట్టం అవుతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

● సముద్రుడి ఉగ్రరూపం

● సముద్రుడి ఉగ్రరూపం

● సముద్రుడి ఉగ్రరూపం