
అక్రమ కేసులు
8 లో
ఎమర్జెన్సీని మించిన అరాచకం రాష్ట్రంలో చూస్తున్నాం. ‘సాక్షి’పై అక్రమ కేసులు పెట్టి నైతికస్థైర్యం దెబ్బతీసే ఎత్తుగడలు ప్రజాస్వామ్యంలో చెల్లవు. చంద్రబాబు సర్కార్ అప్రజాస్వామిక చర్యలు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. సాక్షి మీడియా, ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిమైతే సంబంధిత శాఖ అధికారులు ఖండించవచ్చు. లేదా పరువునష్టం దావా వేసుకునే వీలు చట్టంలోనే ఉంది. కానీ దాడులకు తెగబడటం అవివేకం.
– తోట నరసింహం, మాజీ మంత్రి, వీరవరం
నేతల వార్తలు ప్రచురిస్తే అక్రమ కేసులా
రాజకీయ నాయకులు చేసే ప్రకటనలు వార్తగా ప్రచురిస్తే కేసులు, వేధింపులకు పాల్పడడం దుర్మార్గం. ప్రజల పక్షాన నిలిచే ‘సాక్షి’ పత్రిక సంపాదకుడు ఆర్.ధనుంజయరెడ్డిని అక్రమ కేసులతో వేధించడం తప్పే. వార్తలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వివరణ ఇచ్చుకోవాలి. లేదంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రజాస్వామ్యానికి తూట్లుపొడిచే విషసంస్కృతిని మేధావులు ప్రశ్నించాలి. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, తుని