రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని ఈఏఆర్ ఎయిడెడ్ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న లక్ష్మీశ్రీ సాయి జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. ఏపీ రాష్ట్ర సబ్ జూనియర్ ఫుట్‌బాల్ జట్టు తరఫున గత నెల 25 నుంచి 30వ తేదీ వరకూ ఛత్తీస్‌ఘడ్, నారాయణపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమెను ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ కె.ప్రభాకరరావు, హెచ్‌ఎం పి.షాలిని సౌజన్య, ఉపాధ్యాయులు, పీఈటీ సయ్యద్ షఫీ ప్రోత్సాహమే తన విజయానికి కారణమని లక్ష్మీశ్రీసాయి తెలిపింది. సోమవారం పాఠశాల క్రీడా సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెను మెమెంటోతో సత్కరించారు.