పాడిపోయిన సేవలు! | - | Sakshi
Sakshi News home page

పాడిపోయిన సేవలు!

Sep 8 2025 4:50 AM | Updated on Sep 8 2025 4:50 AM

పాడిప

పాడిపోయిన సేవలు!

పిఠాపురం: పశు సేవలన్నీ గ్రామస్థాయిలోనే అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇవి అరకొర సేవలకే పరిమితమయ్యాయి. గత 15 నెలలుగా మందులు అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు ప్రైవేట్‌ దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. పశువులకు పూర్తిస్థాయిలో టీకాలు కూడా వేయడం లేదు. దాణా పంపిణీ అనేది ఒకటుండేదన్న విషయం కూడా మర్చి పోయారు. విత్తనాల కోసం పడిగాపులు, ఎరువుల కోసం ఆందోళనలు, పంటలు నష్టపోతే సాయం కోసం ఎదురు చూపులు, పశువులకు ఏ చిన్న రోగం వచ్చినా దూర ప్రాంతంలో ఉన్న పశు వైద్య కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితులు మళ్లీ వచ్చేసాయి. వ్యవసాయమే కీలకంగా ఉన్న రాష్ట్రంలో రైతే రాజు. అటువంటి రైతును శ్రీనాటకాలు ఆడుతున్నారు.. అడిగితే తాట తీస్తాశ్రీమంటున్నారు కూటమి నేతలు. చంద్రబాబు అయితే వ్యవసాయం దండగ అని నిస్సిగ్గుగా ప్రకటించారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారం చేపట్టిన నాటి నుంచి ఆ కష్టాలు ఏమీ లేవు. విత్తు నాటిన నాటి నుంచి పంట డబ్బు చేతికి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. ప్రతి గ్రామంలోను రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు కావాల్సిన అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతే రాజు అనే నానుడిని నిజం చేశారు. నకిలీలు, దళారులు, వడ్డీ వ్యాపారుల బాధ లేకుండా అన్నీ స్వగ్రామంలోనే అందేలా చేశాయి. అప్పట్లో ఈ ఆర్బీకేలు. వీటి పనితీరు చూసి కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించగా అనేక రాష్ట్రలు తమ రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో పాటు మన ఆర్బీకేలు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు సాధించాయంటే వీటి పని తీరు ఎంత గొప్పగా ఉందో అర్ధమవుతుంది. అటువంటి చరిత్ర సాధించిన రైతు సేవా కేంద్రాలను కూటమి ప్రభుత్వం చేవ లేని వాటిగా తయారు చేసిందని రైతులు విమర్శిస్తున్నారు.

పశు సంరక్షణ శూన్యం

ప్రధానంగా వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభంలో గేదెలు ఆవుల్లో గొంతువాపు, జబ్బవాపు మొదటి విడత టీకాలు వేయాలి. జూలైలో కుక్కలకు ర్యాబిస్‌ వ్యాధి నివారణకు, గొర్రెలకు, మేకల్లో నీలి నాలుక వ్యాధి నివారణకు టీకాలు వేయాల్సి ఉంది. ఆగస్టులో సంకరజాతి ఆవుల్లో థైలీరియా వ్యాధి నివారణకు, ఆవులు, గేదెల్లో గాలికుంట నివారణ మొదటి విడత టీకాలు వేయాలి. పశువుల్లో డయేరియా వస్తే మాత్రలు, పొట్టలో పాములు పట్టకుండా డీవార్మ్‌ మాత్రలు, పాలు సక్రమంగా ఇచ్చేందుకు లెఫ్ట్‌ డీన్‌ మాత్రలు, గాయాలు, పుండ్లు మానేందుకు పొటాషియం పెర్మాంగనేట్‌ లిక్విడ్‌, కడుపునొప్పి కోసం సిప్రొవెట్‌, పాలు తీసేటప్పుడు గడ్డలు కడితే సన్న కట్టు శుభ్రపరచడానికి జెంటామైసిన్‌, ఆహారం అరుగుదలకు ఎట్రాఫిన్‌, కాళ్లు వాపులకు సోడియం సిలికేట్‌ మందులు వాడాల్సి ఉంది. అలాగే తరచూ వచ్చే జ్వరం, అజీర్ణం, విరేచనాలు, దగ్గు, కాళ్ల నొప్పులు తదితర రోగాలకు ఇక్కడ వైద్య సేవలు అందించాలి. దూడలకు గొంతువాపు వ్యాధి టీకాలు, బ్రూసెల్లోసిస్‌ వ్యాక్సిన్‌, పందులకు స్వైన్‌ ఫ్లూ టీకాలు, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. కృత్రిమ గర్భధారణకు ఎద సూదులు, చూలు కట్టకుంటే పరీక్షించడం వంటి సేవలు అందించాలి.

రైతు సేవా కేంద్రాల్లో ఈ సేవలేవీ పూర్తిస్థాయిలో అండడం లేదు. కానీ ఇవేమీ అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు ప్రైవేటు దుకాణాల్లో రూ.వేలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వర్షాకాలం సీజన్లో ఎక్కువగా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పాడి రైతులు బయట మార్కెట్‌లో మందులు కొనుగోలు చేసుకోవడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జ్వరం, పారుడు వ్యాధి, మేత మేయకపోవడం, నులి పురుగులు, గర్భదారణ సమస్యలు తరచూ వస్తున్నాయి. వీటి కోసం నెలలో సుమారు రూ.2 వేలు వరకూ ఖర్చు చేస్తున్నామని రైతులు వాపోతున్నారు.

కాకినాడ జిల్లాలో

రైతు సేవా కేంద్రాలు 408

ఆవులు 76, 502

గేదెలు 2,82,273

గొర్రెలు 1,01,870

మేకలు 1,41,229

ఆర్‌ఎస్‌కేల్లో అందించాల్సిన సేవలు..

పశుగ్రాస విత్తనాల పంపిణీ, సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ, మినరల్‌ మిక్సర్‌, పశు బీమా, పశు హెల్త్‌ కార్డులు, పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, ప్రతి నెలా పశు విజ్ఞాన కార్యక్రమాలు, పశువులకు టీకాలు, గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు, చిటిక వ్యాధి, బ్రూసెల్లా వ్యాధి, కొక్కెర వ్యాధి, నీలి నాలుక తెగులు, వంటి వ్యాధులకు టీకాలు, డీ వార్మింగ్‌, నట్టల నివారణ కార్యక్రమాల నిర్వహణ. అన్ని రకాల జంతువులకు వ్యాక్సినేషన్‌, కృత్రిమ గర్భధారణ, నిర్ధారణ, పునరుత్పత్తి, సంతానోత్పత్తి వంటి పశు వైద్య సేవలు.

పాడి రైతులకేది భరోసా?

ప్రతి ఆర్‌ఎస్‌కేల్లో 108 రకాల మందులు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఏ ఆర్‌ఎస్‌కేలో చూసినా పట్టుమని పది రకాల మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఏ రైతు సేవా కేంద్రంలో చూసినా 108 రకాలకు ఒకటి రెండు రకాలు మినహా మిగిలిన మందులేవీ అందుబాటులో లేవు. అలాగే పశువులకు వేసే టీకాలు కొన్నిచోట్ల కొన్ని రకాలు మాత్రమే ఉంటున్నాయి. ఏడాదిగా మందుల సరఫరా నిలిచిపోయాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. మందులు అవసరమైన వారిని మండల కార్యాలయాల్లో ఉన్న పశు వైద్యశాలలకు పంపిస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్లు చెబుతున్నారు. పాడి రైతులకు ఉపయోగ పడే మందులు లేకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాడిపోయిన సేవలు!1
1/1

పాడిపోయిన సేవలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement