
మురళీకృష్ణంరాజుకు వైఎస్సార్ సీపీ నేతల సంఘీభావం
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ధర్మవరంలో వైఎస్సార్ సీపీ నరసాపురం నియోజకవర్గ పార్టీమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజుకు ఆదివారం ప్రత్తిపాడు అసెంబ్లీ, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చిన సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గం కో–ఆర్డినేటర్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్‌చార్జి కర్రి జయ సరిత, నరసాపురం జిల్లా ఉపాధ్యక్షుడు జోగాడ ఉమామహేశ్వరరావు, పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు వీరా మల్లికార్జునుడు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దేవ రాజేష్, అమలాపురానికి చెందిన రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబి తదితరులు భారీ ఎత్తున తలివచ్చి మురళీ కృష్ణంరాజుకు, ఆయన తండ్రి రామరాజుకు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం రామరాజుపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.