
గురువుల మార్గదర్శకత్వంతోనే ఈ స్థాయికి
నా తొలి గురువులు తల్లిదండ్రులు షేక్ మీరాబి, కరీమ్. చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవరచి చదువులో బాగా ప్రోత్సహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు ఎస్‌ఎంఎన్‌బీ మెమోరియల్ ఓరియంటల్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు హెచ్‌ఎం కె.నాగేశ్వరరావు నాపై చెరగని ముద్ర వేశారు. గురువుల దయతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. టీచర్ ప్రవర్తన విద్యార్థుల జీవితాలకు స్ఫూర్తిదాయకం కావాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
నిత్యం మననం చేసుకుంటాను
ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానమార్గంలో నడిపించడం గురువుకే సాధ్యం. గురువు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాకినాడ ఐడియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో డాక్టర్ చిరంజీవినీకుమారి చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పారు. సమాజానికి ఉపయోగపడేలా చదువుకోవాలని చెప్పిన మాటలు నేటికీ మననం చేసుకుంటాను.
– దేవిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా రవాణా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
వారి ప్రభావం ఎంతో ఉంది
నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో సాగింది. ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ పద్మజ, ప్రిన్సిపాల్ శశి ప్రభావం నాపై ఎక్కువుగా ఉంది. వారు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. వారిచ్చిన స్ఫూర్తితోనే పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా నాటుకుంది. సాంకేతికంగగా ఎంత ఎదిగినా ఉపాధ్యాయుల పాత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
– బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం

గురువుల మార్గదర్శకత్వంతోనే ఈ స్థాయికి

గురువుల మార్గదర్శకత్వంతోనే ఈ స్థాయికి