
4 వేల కిలోల నల్ల బెల్లం స్వాధీనం
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న నాలుగు వేల కిలోల నల్ల బెల్లాన్ని గురువారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని అంబాగుబా గ్రామం నుంచి కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి మినీ గూడ్స్ వేన్‌లో నల్లబెల్లం రవాణా జరుగుతోంది. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళికి అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ ఎస్‌టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్తు, ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తమ సిబ్బందితో వెళ్లి ధర్మవరం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గూడ్స్ వేన్‌తో పాటు, 4 వేల కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేన్ డ్రైవర్లు సామర్లకోటకు చెందిన తుమ్మల వీర వెంకట సూర్యతేజ, పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందిన నక్కా చినవీర్రాజులను అరెస్టు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి దాడి లోవరాజుపై కేసు నమోదు చేసినట్టు ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తెలిపారు. ఈదాడిలో ప్రత్తిపాడు ఎకై ్సజ్ ఎస్సై పున్నం వంశీరామ్ తదతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరి అరెస్టు