
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
తొండంగి: మండలంలోని ఒంటిమామిడి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్టు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒంటిమామిడిలో ఆగస్టు 11న బొమ్మదేవ్ సారధి ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో దుండుగులు బంగారు, వెండి నగలు, కొంత నగదు చోరీ చేశారు. దీనిపై విచారణ చేపట్టి బుధవారం నిందితులను అనకాపల్లి జిల్లా రేవుపోలవరానికి చెందిన చేపల నాని అలియాస్ స్టైలిష్ నాని, యు.కొత్తపల్లికి చెందిన బొండు శివలను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి చోరీ చేసిన నగలు తాకట్టు పెట్టి స్కూటీ కొనుగోలు చేయగా ఆ వాహనంతో పాటు కొంత నగదును రికవరీ చేశామన్నారు. రికవరీ సొత్తు విలువ రూ.2.4 లక్షలు ఉంటుందన్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పీసీలు సీహెచ్ మణి వీరకంఠ, సీహెచ్ దొర, పి.శివ, కేఆర్వీ సత్యనారాయణ, టి.శ్రీనివాస్, ఆర్.కిశోర్‌లను ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారని తెలిపారు.