
వైఎస్సార్ సీపీ అభివృద్ధికి సత్యనారాయణ కృషి
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అభివృద్ధికి కురసాల సత్యనారాయణ విశేషంగా కృషి చేశారని, ఆయన మృతి బాధాకరమని, మాజీ మంత్రి కన్నబాబుకు తండ్రి లేని లోటు తీర్చలేనిదని పలువురు నేతలు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో గత నెల 19న మృతిచెందిన సంగతి విదితమే. కాకినాడ వైద్యనగర్‌లో సత్యనారాయణకు గురువారం దశ దినకర్మలను కుమారులు కన్నబాబు, ఆయన సోదరుడు కళ్యాణ్‌కృష్ణ, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అనంతబాబు, పేరాబత్తుల రాజశేఖర్, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, కారుమూర్తి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జెడ్పీ చైర్మ న్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరావు, కరణం ధర్మశ్రీ, సత్తి సూర్యానారాయణరెడ్డి, జ్యోతుల చంటిబాబు, పాముల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు, మాజీ ఎంపీ వంగా గీత, ఆధ్మాత్మిక గురురు ఉమర్ ఆలీషా, మాజీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంతాప సభలో పలువురు నేతలు