
తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు
ప్రత్తిపాడు రూరల్: టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. గురువారం మండలంలోని ధర్మవరంలో ఆయన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గ్రామంలో టీడీపీ నియోజకవర్గ నేతలు మీడియా సమావేశంలో మురళీకృష్ణంరాజుపై పలు విమర్శలు చేశారు. వారి విమర్శలను మురళీకృష్ణంరాజు మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, మహిళతో అసభ్యంగా ప్రవర్తించడానికి, 86 ఏళ్ల వయస్సుకు సంబంధం లేదంటూ టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. వాటిని ప్రశ్నిస్తే టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుతో కలిసి.. తమ పార్టీ శ్రేణులకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీఎత్తున తరలివచ్చి మురళీకృష్ణంరాజుకు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జల్లిగంపల ప్రభాకరావు, ఏనుగు శ్రీను, గొనగాల అప్పలరావు, నడిగట్ల త్రీమూర్తులు, జువ్వల బాబులు, ఉమ్మిడి తాతీలు, మాకా చంటిబాబు, తటవర్తి రామన్నదొర, బత్తుల నాగార్జున, దాడిశెట్టి చక్రధర్, సీంద్రపు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నరసాపురం
పార్లమెంటరీ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు