
క్రైస్తవులకు అండగా వైఎస్సార్ సీపీ
అమలాపురం రూరల్: క్రైస్తవులకు వైఎస్సార్ సీపీ ఎప్పడూ అండగా ఉంటూ వారి హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం పార్టీ జిల్లా సెల్ అధ్యక్షురాలు ఈదా సంధ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెస్లీ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బలోపేతానికి గ్రామాల్లోని క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు కృషిచేయాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండడంతోనా పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశ్వాసాన్ని ఉంచి పార్టీని మందుకు తీసుకెళ్లాలన్నారు. అలాగే క్రైస్తవులకు పార్టీ ఎప్పడూ అండగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా అంతా కృషిచేయాలని సూచించారు. కష్టపడిన వారికి పార్టీలో ఎప్పుడూ సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. దానికి అనుగుణంగా గ్రామస్థాయిలో కార్యకర్తలకు నియోజకవర్గ నాయకునిగా ఎదిగే అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేలా అందుబాటులో ఉంటారని అన్నారు.
రాష్ట్ర క్రిస్టియన్
మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ