ఖరీఫ్‌..అసేద్యం! | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌..అసేద్యం!

Aug 8 2025 7:51 AM | Updated on Aug 8 2025 7:51 AM

ఖరీఫ్

ఖరీఫ్‌..అసేద్యం!

చేయని పనులకు రూ.కోట్లు ‘క్లోజ్‌’

సాగునీటి కాలువల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన గుర్రపుడెక్క, తూటికాడ

సక్రమంగా అందని సాగునీరు

ఆదిలోనే అన్నదాతలకు కష్టాలు

పిఠాపురం: పుణ్యకాలం పూర్తయిపోతోంది. ఖరీఫ్‌ సాగుకు నీరు సకాలంలో అందక, నారు లేక రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాలువలకు నీరు విడుదల చేశామని అధికారులు చెబుతుండగా ఎక్కడికక్కడే పెరిగిపోయిన పూడికలతో శివార్ల సంగతి తరువాత.. సమీప పొలాలకు సైతం నీరు అందక, నాట్లు పడక.. రైతులు పాట్లు పడుతున్నారు. ఏ చెరువు చూసినా జలకళ తప్పిపోయే కనిపిస్తున్నాయి. రూ.కోట్లు వెచ్చించి క్లోజర్‌ పనులు చేసేశామని అధికారులు చెబుతూండగా.. చాలాచోట్ల కాలువల్లో గుర్రపుడెక్క, తూటికాడ దర్శనమిస్తున్నాయి. ఫలితంగా సక్రమంగా నీరందక రైతులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ), ఏలేరు పరిధిలో 42 వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ ఏలేరు నుంచి కానీ, పీబీసీ నుంచి కానీ సరిగ్గా నీరందకపోవడంతో 15 శాతం విస్తీర్ణంలో మాత్రమే నారుమడులు పడ్డాయి. సుమారు 20 శాతం విస్తీర్ణంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నీరు లేక గగ్గోలు

ఏలేరు ప్రాజెక్టులో తగినన్ని నీటి నిల్వలు లేకపోవడంతో ఆ ఆయకట్టులో కనీసం నారుమడులు కూడా వే యలేని దుస్థితి నెలకొంది. సాధారణంగా ఈ సమ యానికి నాట్లు పూర్తయ్యి, కలుపు తీసే పనుల్లో రైతు లు నిమగ్నం కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ ఎక్క డా ఒక్క నారుమడి కూడా సిద్ధం కాకపోవడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఏలేరు నుంచి నీరు వి డుదల చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ పిఠాపురం ఆయకట్టుకు చుక్క నీరు కూడా చేరలేదు. మరోవైపు పీబీసీ నుంచి అరకొరగా నీరు వస్తున్నా ప లు చోట్ల కాలువల్లో పూడికలు ఉండటంతో నీరు ముందుకు ప్రవహించడం లేదు. మరో వైపు వర్షాలను న మ్ముకుని వాణిజ్య పంటలు వేసిన రైతులకు బోర్ల ద్వా రా నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల వాటి ద్వారా కూడా నీరందక బావుల్లో నీరు తో డుకుని, మోసుకుని మొక్కలకు తడులు అందించాల్సి న పరిస్థితి దాపురించిందని అన్నదాతలు వాపోతున్నా రు. వెదజల్లే పద్ధతిలో సాగు ప్రారంభించాలని వ్యవ సాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే, నీరు లేకుండా, దమ్ము చేయకుండా, ఎలా వెదజల్లుతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఖరీఫ్‌ సాగు ఏవిధంగా చేయగలమని ప్రశ్నిస్తున్నారు.

ఎక్కడి పూడిక అక్కడే..

రూ.కోట్ల వ్యయంతో క్లోజర్‌ పనులు చేస్తున్నామ ని అధికారులు, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఏ కాలువ చూసినా ఎక్కడి పూడిక అక్కడే కనిపిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. పని చేసినట్టుగా రాసుకుంటున్నారు తప్ప ఎక్కడా ఏ కాలువనూ పూర్తిగా బాగు చేయలేదని చెబుతున్నారు. కాలువల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోవడంతో నీరు వదిలినా పొలాలకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కొన్నిచోట్ల మొక్కుబడిగా పూడికలు తొలగించి, ఫొటోలు తీసుకుని అంతా చేసినట్లుగా రాసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఖరీఫ్‌..అసేద్యం!1
1/3

ఖరీఫ్‌..అసేద్యం!

ఖరీఫ్‌..అసేద్యం!2
2/3

ఖరీఫ్‌..అసేద్యం!

ఖరీఫ్‌..అసేద్యం!3
3/3

ఖరీఫ్‌..అసేద్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement