
శ్రావణ శోభ
ఫ నేడు వరలక్ష్మీ వ్రతం
ఫ కొండెక్కిన పండ్లు, పువ్వుల ధరలు
ఫ కిటకిటలాడిన మార్కెట్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో జిల్లావ్యాప్తంగా మార్కెట్లు రద్దీగా మారాయి. వరలక్ష్మీ వ్రతాన్ని ముత్తయిదువలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామగ్రి, పువ్వులు, పత్రి, బంగారు లక్ష్మీ రూపుల వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గురువారం మార్కెట్‌కు వచ్చారు. దీంతో, పలు దుకాణాలు రద్దీగా మారాయి. పత్రి, పండ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు బయటకు రావడంతో భానుగుడి, నాగమల్లితోట జంక్షన్, అశోక్ నగర్, గాంధీనగర్, రామారావుపేట, బాలాజీ చెరువు సెంటర్, పెద్ద మార్కెట్‌లో సందడి నెలకొంది. రోడ్డు పక్కన పత్రి, పండ్ల దుకాణాలు వెలియడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. భానుగుడి, బాలాజీ చెరువు, పెద్ద మార్కెట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు మరింతగా ఆకాశన్నంటాయి. పత్రి, పువ్వులు, పండ్ల ధరలు రెట్టింపయ్యాయి. దీంతో, పలువురు ఉన్నంతలోనే పూజా సామగ్రి కొనుగోలు చేసుకొని ఇంటి ముఖం పట్టారు.
గత ఏడాదితో పోల్చితే ధరలు పెరిగాయిలా.. (రూ.)
పూలు/పండ్లు గత ఏడాది ప్రస్తుతం
చామంతి పూలు (కిలో) 400.00 800.00
(విడిగా ఒక్కో పువ్వు రూ.2)
మొక్కజొన్న పొత్తు (1) 5.00 15.00
అరటి పండ్లు (డజను) 40.00 60.00
బత్తాయి పండ్లు (డజను) 100.00 250.00
దానిమ్మ పండు (1) ––– 40.00
జామకాయ (1) ––– 15.00

శ్రావణ శోభ