
క్వార్టర్స్ దశలో జాతీయ జూనియర్ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని హాకీ టర్ఫ్ మైదానంలో జరుగుతున్న 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు గురువారం క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలలో ప్రీ క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఓటమి పాలై అభిమానులను నిరాశ పరచింది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్, చంఢీఘర్ జట్లు పోటీపడగా మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 1–1 స్కోర్ చేయడంతో డ్రాగా కాగా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ 6–1 స్కోర్‌తోను, ఆంఽధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 5–1 స్కోర్‌తో గెలుపొందాయి. శనివారం నిర్వహించనున్న క్వార్టర్ ఫైనల్స్‌లో హర్యాణా జట్టు ఒడిశాతోను, మధ్యప్రదేశ్ జట్టు ఛత్తీస్‌గఢ్‌తోను, జార్ఘండ్ జట్టు పంజాబ్‌తోను, మహారాష్ట్ర జట్టు ఉత్తర్ ప్రదేశ్‌తోను పోటీ పడనున్నాయి. శుక్రవారం విశ్రాంతి రోజుగా నిర్వాహకులు ప్రకటించారు. గురువారం నిర్వహించిన మ్యాచ్‌లను మెడికోవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ ఎం.సుబ్బారావు అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. హాకీ సంఘ కార్యదర్శి హర్షవర్ధన్, కోశాఽధికారి థామస్ పీటర్, కో–ఆర్టినేటర్ వి.రవిరాజు, భవానీ శంకర్, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్‌లు పోటీలను పర్యవేక్షించారు.