
యువకుడి అదృశ్యం
కె.గంగవరం: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలినారు. ఆయన కథనం ప్రకారం.. రామచంద్రపురం మండలం భీమకోసుపాలేనికి చెందిన కలిదిండి చంద్రశేఖర్(27) శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడికి చనిపోతున్నానని మెసేజ్ పెట్టి కనిపించకుండా వెళ్లిపోయాడు. చంద్రశేఖర్‌కు చెందిన మోటారు సైకిల్, సెల్ ఫోన్ సుందరపల్లి ఏటిగట్టుపై కనిపించాయి. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాని ఎస్సై జానీ బాషా చెప్పారు.