
సత్యదేవా జయము.. జయము
పల్లకీపై సత్యదేవుని ఊరేగింపు
స్వామి, అమ్మవార్ల రథోత్సవానికి వర్షం ఆటంకం కలిగించడంతో ఆలయ ప్రాంగణంలో కాకుండా లోపలి ప్రాకారంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి తదితరులు నిర్వహించారు.
అన్నవరం: రత్నగిరీశుడు వీర వేంకట సత్యనారాయణ స్వామివారి 135వ జయంత్యుత్సవాలు (ఆవిర్భావ దినోత్సం) శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను, ఆధ్యాత్మిక సౌరభాన్ని సంతరించుకుంది. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి పూజల అనంతరం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ ప్రధానాలయంలోని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుని మూలవిరాట్‌లకు పంచామృతాలతో మహన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించారు. ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనాలు కల్పించారు.
ఘనంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి
అనివేటి మండపంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆయుష్యహోమంలో శనివారం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి చేశారు. దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
18 మంది పండితులకు సత్కారం
వేడుకల్లో భాగంగా చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు 18 మంది వేద పండితులను సత్కరించారు. రాజమహేంద్రవరానికి చెందిన దువ్వూరి సూర్యప్రకాశ అవధాని, పుల్లెల సత్యనారాయణ శాస్త్రి, విజయవాడకు చెందిన విరూపాక్షం శ్యావాస మహర్షి, భీమవరానికి చెందిన టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, అన్నవరం దేవస్థానం పంచాగకర్త తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతి, కందుకూరి సుబ్బారావు, కొండవీటి రాంబాబు సత్కారాలు పొందిన వారిలో ఉన్నారు. అలాగే దేవస్థానం విశ్రాంత వేద పండితుడు ముష్టి కామశాస్త్రి, చింతా చలపతి అవధాని, గొర్తి సుబ్రహ్మణ్య ఘనపాఠి, విశ్రాంత ప్రధాన అర్చకుడు ఇంద్రగంటి గోపాలకృష్ణ శాస్త్రి, నాగాభట్ల సత్యనారాయణ తదితరులను సత్కరించారు.
వైభవంగా రత్నగిరీశుని
జయంత్యుత్సవం
మూలవిరాట్‌లకు
పంచామృత అభిషేకాలు
ఘనంగా ఆయుష్యహోమం
ఆలయ ప్రాకారంలో పల్లకీ సేవ
వేద పండితులకు ఘన సత్కారం

సత్యదేవా జయము.. జయము

సత్యదేవా జయము.. జయము