
సుగుణారెడ్డికి రెడ్‌క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్‌క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్‌క్రాస్ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్‌క్రాస్‌ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలుపుతున్న సుగుణారెడ్డికి పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు.
అక్కాచెల్లెళ్ల అదృశ్యం
రావులపాలెం: ఇద్దరు బాలికల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.శేఖర్‌బాబు తెలిపారు. గోపాపురానికి చెందిన ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్లు. గురువారం వారి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అక్కాచెల్లెళ్లు కనిపించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.