
ఎంపీడీవో రాజేశ్వరరావు సస్పెన్షన్
తొండంగి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా మండల పరిషత్ ఎంపీడీవో బి.రాజేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణ తేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్‌త్‌లో ఈవోపీఆర్డీ, ఇన్‌చార్జి ఎంపీడీవోగా బి.రాజేశ్వరరావు విధులు నిర్వహించారు. రూ.14,84,900 నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పటి జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో క్రిమినల్ మిస్ కాండక్ట్ కింద ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తుని మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న కె.సాయినవీన్‌కు తొండంగి మండలం ఎంపీడీవో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్టు జిల్లా పరిషత్ సీఈఓ నుంచి ఆదేశాలందాయి.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ
ప్రధాన కార్యదర్శిగా అయ్యారావు
పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించిన రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గొల్లప్రోలుకు చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మొగలి మాణిక్యాలరావు (అయ్యారావు) నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అయ్యారావు తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతావిశ్వనాఽథ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఆరా
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో చోటు చేసుకున్న పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. శుక్రవారం రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్త లూరి విష్ణువర్దన్‌కు కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఫోన్ చేశారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. విచారణపై ఆరా తీసి, నిందితులపై కళాశాల తరఫున చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎంపీడీవో రాజేశ్వరరావు సస్పెన్షన్