ప్రచారం ఇదేండబ్బా | - | Sakshi
Sakshi News home page

ప్రచారం ఇదేండబ్బా

Jul 10 2025 6:45 AM | Updated on Jul 10 2025 6:45 AM

ప్రచారం ఇదేండబ్బా

ప్రచారం ఇదేండబ్బా

ప్రచారం.. పనిభారం

ఈ కార్యక్రమ మార్గదర్శకాల్లోనే నాలుగైదు రోజుల ముందు నుంచే ఏమేమి చేయాలో కార్యకలాపాలను పొందుపర్చారు. పాఠశాలల్లో పాఠా లు చెప్పాల్సిన ఉపాధ్యాయులను తల్లికి వందనం పథకాన్ని ప్రచారం చేసేవారిగా ప్రభుత్వం మార్చేసింది. 17 కమిటీలను వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రభుత్వం చెప్పడంతో ఉపాధ్యాయులంతా ఇదే పనికి తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇందులో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు సచివాలయ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను భాగస్వాములను చేశారు. వీరిని ఒక్కో పాఠశాలకు పర్యవేక్షకులుగా నియమించారు. వారి శాఖల పనిని పక్కన పెట్టి ప్రభుత్వ ఆదేశాలను పాటించే స్థితికి తీసుకొచ్చారు.

కపిలేశ్వరపురం: చేసేది తక్కువ... గొప్పలెక్కువ అన్నట్టు కూటమి ప్రభుత్వ తీరు ఉంది. విలువైన ప్రజాధనాన్ని ప్రచారానికే కేటాయిస్తుంది. ఇప్పటి వరకూ యోగా దినోత్సవం పేరుతో సుమారు రూ.300 కోట్లను ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా కూటమి ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయంటూ గొప్పలు చెప్పుకొంది. అదే కోవలో నేడు మరో ప్రచారానికి సిద్ధం చేసింది. మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ డే కార్యక్రమాన్ని మెగా పీటీఎం 2.0 పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించేందుకు కార్యాచరణ చేసింది. విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం వెనుక కూటమి ప్రభుత్వ ప్రచారం దాగి ఉంది. దీని నిర్వహణకు పరిమితంగా నిధులను కేటాయించి, స్కూల్‌ కాంపోజిట్‌ గ్రాంట్‌ నుంచి ఖర్చు పెట్టుకోమని చెబుతోంది. ప్రైవేట్‌ సంస్థల్లో ఆ యాజమాన్యం సొంత ఖర్చుతో కార్యక్రమాన్ని పండగలా చేయాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రస్తుతం ఈ కార్యక్రమం తలకు మించిన భారంగా మారుతోంది.

నేడు విద్యాసంస్థల్లో కార్యక్రమాలు

జిల్లావ్యాప్తంగా ఉన్న 2,150 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేరెంట్స్‌ మీటింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల ఫలితాల వివరాలతో కూడిన హోలెస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులను విద్యార్థులకు అందజేయనున్నారు. వీటితోపాటు మరికొన్ని కార్యక్రమాలు రూపొందించినప్పటికీ ప్రధాన అజెండా కూటమి ప్రభుత్వ ప్రచారమే. తల్లికి వందనం సాయం అందజేశామన్న విషయాన్ని ఫోకస్‌ చేసే దిశగా కార్యక్రమాన్ని రూపొందించారు.

ఇప్పటికే సన్నాహక సమావేశాలు

ఈ నెల 4న ఇంటర్మీడియెట్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు అమలాపురం బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మెగా పీటీఎం సన్నాహక సమావేశం నిర్వహించారు. 8న జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు కరస్పాండెంట్స్‌, ప్రిన్సిపాల్స్‌కు జిల్లా సన్నాహక సమావేశం జరిపారు. పిల్లలకు పాఠాలు చెప్పే పనిని పర్యవేక్షించాల్సిన విద్యా సంస్థ నిర్వాహకులు, బాధ్యులను కూటమి ప్రభుత్వ ప్రచారాన్ని సమయాన్ని కేటాయించమనడంపై నిరసన వ్యక్తమవుతోంది.

ఇది సాధ్యమయ్యేనా?

పాఠశాలల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులతో మొక్కలను నాటాలని సూచించారు. ఆ మొక్కలను విద్యార్థి బాధ్యతగా సంరక్షించాలని చెబుతున్నారు. రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అది సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటే మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ ప్రత్యేక నిధులను, సిబ్బందితో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

వివాదాలు రాకుండా చూడాలని..

పేరెంట్స్‌ మీటింగ్‌ అనగానే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సాయం వివరాలను తెలుసుకోవాలని అనుకుంటారు. ఇటీవల తల్లికి వందనం లబ్ధిదారుల్లో అనేక మంది అర్హులకు సాయం అందలేదు. వారు అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పేరెంట్స్‌ మీటింగ్‌లో వివాదాలు రాకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదే అని, ప్రొటోకాల్‌ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలంటూ సూచించింది.

మెగా పీటీఎం 2.0 పేరుతో కార్యక్రమం

తల్లికి వందనంపై సొంత బాకా

ఉపాధ్యాయులకు పనిభారం

పక్కదారి పట్టిన విద్యాబోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement