
అంతర్ జిల్లాల ఈత పోటీలకు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా అమెచ్యూర్ ఆక్వాటిక్ సంఘం ఆధ్వర్యాన కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) ప్రాంగణంలో అంతర్ జిల్లాల ఈత పోటీలకు ఆదివారం జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. దీనిని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) బి.శ్రీనివాస్ కుమార్, జాతీయ మారథాన్ స్విమ్మర్ గోలి శ్యామల ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరీల్లో ఈ ఎంపికలు జరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 150 మంది ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 30 మందిని అంతర్ జిల్లాల ఈత పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఐ.రాజు, గౌరవ సలహాదారు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంపికల్లో డీఎస్‌ఏ స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, ఎం.అజయ్‌కుమార్, వీరభద్రయ్య, ఎస్.రాజేష్, జి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.