
శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాలలతో విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా ఆలయానికి 3,84,962 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు.
వెబ్ ఎక్విప్‌మెంట్
రూము ప్రారంభం
కాకినాడ క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సాంకేతిక పరికరాలు కలిగి ఉండే వెబ్ ఎక్విప్‌మెంట్ రూమును ఎస్పీ బిందుమాధవ్ శనివారం ప్రారంభించారు. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అనంతరం కార్యాలయ పరిసరాల్లో కొబ్బరి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్‌ఐ (అడ్మిన్) నరసింహమూర్తి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తలుపులమ్మకు
జన్మనక్షత్ర పూజలు
తుని: ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా లోవ దేవస్థానంలో వేంచేసిన తలుపులమ్మ తల్లికి శనివారం జన్మనక్షత్ర పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారి మూలవిరాట్ వద్ద పండితులు మేలుకొలుపు, నిత్యార్చన, పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. అనంతరం మహా మంటపంలోని అమ్మవారి విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను తిలకించిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం నిర్వహించే తొలి ఏకాదశ పూజలకు ఈఓ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పండితులు తెలిపారు.
మెగా పీటీఎం సమర్థంగా
నిర్వహించాలి
కాకినాడ సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 10న మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0 సమర్థంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యా శాఖ అధికారులను కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. జిల్లాలోని 1,260 ప్రభుత్వ, 596 ప్రైవేట్, 20 ఎయిడెడ్ కలిపి 1,876 పాఠశాలల్లో చదువుతున్న 2,78,932 మంది.. 131 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని 45,344 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పీటీఎం నిర్వహించనున్నామని వివరించారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ
విభాగాల్లో పలువురికి చోటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పించారు. రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలిగా మాకినీడి శేషుకుమారి, మహిళా విభాగం అధికార ప్రతినిధిగా పోలసపల్లి సరోజ చెరియన్, రాష్ట్ర పంచాయతీ విభాగం జాయింట్ సెక్రటరీగా సుంకర వీర వెంకట వీరభద్రరావును నియమించారు.

శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు