ఉచిత బస్సు అంటే నిజమనుకున్నాం
అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని అంటే ఎంతో సంబరపడ్డాం. మాలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందనుకున్నాం. నిజమనుకుని, నమ్మి ఓట్లు వేశాం. కానీ, అధికారంలోకి వచ్చాక తెలిసింది అదంతా నాటకమని.. కేవలం మహిళలను మోసం చేయడానికే ఆ హామీ ఇచ్చారని. ఏడాది పూర్తవుతున్నా ఉచిత బస్సు గురించి మాట్లాడడం లేదు. ఇంకా ఇస్తున్నాం అంటున్నారు తప్ప ఇవ్వడం లేదు. మహిళలను మభ్యపెట్టడానికే ఈ హామీ ఇచ్చారని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో మహిళలు తగిన బుద్ధి చెబుతారు.
– యేడిద సునీత, జీవన్‌నగర్, పిఠాపురం
కలగానే..
ఏడాది కావస్తున్నా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ ఇప్ప టి వరకూ నెరవేరలేదు. మూ డు నెలలకోసారి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని నాయకులు చెబుతున్నారు తప్ప ఆచరణలోకి మాత్రం రావడం లేదు.
– వేల్పూరి రత్నకుమారి, గండేపల్లి
విధివిధానాలు రావాలి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఆచరణలో పెడతాం.
– పి.శ్రీనివాసరావు,
జిల్లా ప్రజా రవాణా అధికారి, కాకినాడ
ఉచిత బస్సు అంటే నిజమనుకున్నాం
ఉచిత బస్సు అంటే నిజమనుకున్నాం


