
గిన్నిస్ రికార్డ్స్‌లో మెప్మాకు చోటు
కాకినాడ సిటీ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెప్మా సంస్థ చోటు సంపాదించింది. మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను వాప్ జెని ఆన్‌లైన్ యాప్ ద్వారా లక్ష్యానికి మించి విక్రయించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెప్మా పీడీ బి.ప్రియంవద కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్క రోజులో లక్షకు పైగా ఉత్పత్తులు విక్రయించి, ఈ రికార్డ్ సాధించిన మహిళలను, పీడీ ప్రియంవదను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.