
22 కాసుల బంగారు ఆభరణాల చోరీ
నల్లజర్ల: స్థానికంగా గత రాత్రి భారీ చోరీ జరిగింది. నల్లజర్ల ఏఎస్‌ఐ సోమరాజు చెప్పిన వివరాల ప్రకారం నల్లజర్ల సొసైటీ రహదారిలో ఉన్న మారడుగల శ్రీనివాస్ ఈ నెల 15వ తేదీన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి వెనుక తలపులు పగులగొట్టి ఉండాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలు, నాలుగు తులాల వెండి చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ దొంగల ఆగడాలు
బిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని విద్యుత్ దొంగల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విద్యుత్ టాన్స్‌ఫార్మర్ పగుల గొట్టి దానిలో ఉన్న రాగి తీగ చోరీ చేస్తున్నారు. శనివారం రాత్రి మళ్లీ మూడు చోట్ల చోరీ ప్రయత్నం చేశారు. రెండు చోట్ల చోరీ జరిగింది. బలభద్రపురం గ్రామానికి చెందిన దార్వంపూడి సూర్యనారాయణరెడ్డి, మరో రైతు పొలంలో చోరీ జరిగింది. పక్కనే ఉన్న ఎస్‌వీవీకే రెడ్డి పొలంలో చోరీ ప్రయత్నం చేశారు. ఆయన ట్రాన్స్‌ఫార్మర్ బోల్టులకు వెల్డింగ్ చేయించారు. దొంగల దాన్ని బద్దలు కొట్టలేక అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
పీఎంజే జ్యూయలర్స్
ప్రారంభం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దక్షిణ భారతదేశంలో అందరికీ ప్రియమైన జ్యూయలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యూయలర్స్ కాకినాడ దేవాలయం వీధిలో ఏర్పాటు చేసిన కొత్త షోరూంను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పీఎంజే ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ ఆలీ, క్లస్టర్ మేనేజర్ షేక్ గాలి షరీఫ్ ఆదివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఎంజే జ్యూయలర్స్ కాకినాడలో విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. షోరూమ్‌లో ఆభరణాల నాణ్యత, హస్తకళ పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమన్నారు. పీఎంజే ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ ఆలీ మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగత ఎంపికలకు అనువైన ఆతిథ్యం అనుభవించడానికి మేము ప్రతీ ఒక్కరినీ స్వాగతిస్తున్నామన్నారు. తమ షోరూమ్‌లకు అమెరికాతోపాటు దక్షిణ భారతదేశంలో ప్రజల ఆదరణ ఎంతగానో లభిస్తోందన్నారు. తమ జ్యూయలర్స్‌లో డిజైన్‌లు భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తాయన్నారు. కాకినాడ షోరూమ్ హెడ్ శేషగిరి పాల్గొన్నారు.

22 కాసుల బంగారు ఆభరణాల చోరీ