
మాట్లాడితే జరిమానా
పదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. రజక వృత్తి కానీ, పొలం పని కానీ చేయలేని స్థితిలో ఉన్నాను. గ్రామంలో టిఫిన్ సెంటర్ పెట్టి జీవనం సాగిస్తున్నాను. గ్రామంలో అన్ని కులాల వాళ్లు టిఫిన్ పట్టుకెళ్లేవారు. ఇప్పుడు వివాదం కారణంగా రజకులతో గౌడ సంఘం వారు మాట్లాడడం లేదు. మాట్లాడితే జరిమానా అంటున్నారు. టిఫిన్ బకాయిల కోసం మాట్లాడలేని పరిస్థితి ఉంది. టిఫిన్ కొనుగోలుకూ ఒక వర్గం వారు రావడం లేదు.
– ఆచంట వెంకటరమణ, చిడిపి, కొవ్వూరు మండలం
●