
ప్లేట్‌లెట్లు తగ్గిపోయిన గర్భిణికి ప్రసవం
అమలాపురం టౌన్: మనిషి శరీరంలో రక్త కణాలు (ప్లేట్‌లెట్లు) లక్షల్లోంచి వేలల్లోకి పడిపోతే మనం కంగారు పడతాం. అలాంటిది ఓ గర్భిణికి ప్లేట్‌లెట్లు 15 వేలకు పడపోవడమే కాకుండా మధుమేహం కూడా తోడవడంతో ఆమె ప్రసవం కష్టమైంది. ఈ తరుణంలో వైద్యులు రిస్క్‌తో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి నెలల నిండడంతో ప్రసవం కోసం అమలాపురంలోని సాయి రవీంద్ర హాస్పిటల్‌లో చేరింది. చేరే సమయానికే ఆమె ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా (ఐటీపీ) ప్లేట్‌లెట్లు 15 వేలకు పడిపోయి మధుమేహంతో బాధపడుతోంది. హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గంధం భవానీ ..ఆమె ప్రసవం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఫిజిషియన్ డాక్టర్ శ్రీహరి, మత్తు వైద్యుడు సందీప్, పిల్లల డాక్టర్ యోగానంద్, ఆర్థోపెడిక్ రవీంద్రలతో కూడిన వైద్య బృందం శస్త్ర చికత్స చేసి ప్రసవం చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ ఆరోగ్యంగా కోలుకుంటున్నారని డాక్టర్ భవాని తెలిపారు.