
బాధితులకు రూ.18.34 కోట్ల నష్టపరిహారం పంపిణీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి జిల్లా పరిధిలో 42 బెంచ్‌లలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రూ.18,33,80,798 నష్ట పరిహారాన్ని బాధితులకు అందజేశారు. రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఇరు పార్టీలకు డబ్బు, సమయం వృథా కాకుండా చూడడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఉమ్మడి జిల్లాలో రాత్రి 9 గంటల వరకూ 5,297 క్రిమినల్, 474 సివిల్, 147 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేసుల పరిష్కారం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయమూర్తులు, కోర్టులు పనిచేస్తాయన్నారు.