పంచారామ క్షేత్రంలో జ్యోతిర్లింగార్చన | - | Sakshi
Sakshi News home page

పంచారామ క్షేత్రంలో జ్యోతిర్లింగార్చన

Dec 1 2023 3:24 AM | Updated on Dec 1 2023 3:24 AM

- - Sakshi

సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఆలయంలో లక్ష పత్రి పూజలు చేసుకుంటున్న వారి కోసం ఆలయ దీపారాధన సంఘ సభ్యులు జ్యోతిర్లింగార్చన ఏర్పాటు చేశారు. కార్తిక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే తాము కోరుకున్నది నెరవేరుతుంద భక్తులు పంచారామ క్షేత్రంలో పోటీ పడు తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారికి పూజలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.

జాతీయ తైక్వాండో

రిఫరీగా హర్షవర్ధన్‌

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటి): డెహ్రాడూన్‌లో శుక్రవారం నుంచి మూడో తేదీ వరకు జరిగే 37వ జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లాలోని పెద్దాపురానికి చెందిన ఎం.హర్షవర్ధన్‌ రిఫరీగా నియమితులయ్యారు. తైక్వాండో సంఘ జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు గురువారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ మేరక తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి నియామక ఉత్తర్వులు హర్షవర్ధన్‌ అందుకున్నారు. హర్షవర్ధన్‌ పెద్దాపురం ఎంఆర్‌ కళాశాలలో డిగ్రీ ద్విదీయ సంవత్సరం చదువుతున్నాడని, బ్లాక్‌బెల్ట్‌తో పాటు రిఫరీ సర్టిఫికెట్‌ సాధించాడని తెలిపారు.

ధర్మవరంలో

వరికోతలు ప్రారంభం

ప్రత్తిపాడు రూరల్‌: మండలంలోని ధర్మవరంలో తాను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న పొలంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురువారం వరి కోతలు ప్రారంభించారు. ధర్మవరంలో జేడీ లక్ష్మీనారాయణ 12 ఎకరాలు కౌలుకు తీసుకుని ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో దేశవాళి వరి వంగడాలను సాగు చేశారు. కొత్త పద్ధతుల్లో అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు.

రాష్ట్ర స్ధాయి సైన్స్‌

కాంగ్రెస్‌ పోటీల్లో ప్రతిభ

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర స్ధాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల్లో కాకినాడ మధర్‌ థెరిస్సా మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి బిందు బృందం విశేష ప్రతిభ చూపింది. వీరు రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 29,30 తేదీల్లో గుంటూరు కేఎల్‌ యూనివర్సిటీలో రాష్ట్రస్ధాయి పోటీలు నిర్వహించారు. చిత్తడి నేల అవరణ వ్యవస్థలో–వలస పక్షుల సంరక్షణ అనే ప్రాజెక్టు జాతీయ స్ధాయి ఎంపికై ంది. కాకినాడ తూర్పు తీర ప్రాంతం, నది ముఖ ద్వారా ప్రాంతంలో నీటి పక్షుల సంఖ్య తగ్గుతోంది. మడ అడవుల్లో ఉన్న బ్లాక్‌ బిల్డ్‌ టర్న్‌ అనే పక్షులు అంతరించడంతో పాటు అంతర్జాతీయంగా 14 రకాలు అంతరించి పోతున్న పక్షులు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఖ్య పక్షి కేంద్రంగాను,రామ్‌సర్‌ కేంద్రంగా పరిగణించాలని ఈ స్కూలు విద్యార్థులు తమ ప్రాజెక్టు ద్వారా సూచించారు. విద్యార్థుల బృందం ప్రవళిక,బిందులు ప్రజెంటేషన్‌ చేయగా గైడ్‌గా కేఆర్‌ఎస్‌ చంద్రారెడ్డి వ్యవహారించారు. ఈ సందర్భంగా విద్యార్థుల బృందాన్ని డీఈఓ అన్నపూర్ణ,కో–ఆర్డినేటర్‌ కేసరి శ్రీనివాసరావు,అకడమిక్‌ సమన్వయకర్త కె.వెంకట్రావు అభినందించారు.

పంచారామ క్షేత్రంలో జ్యోతిర్లింగార్చన1
1/3

పంచారామ క్షేత్రంలో జ్యోతిర్లింగార్చన

జాతీయ స్ధాయికి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు 
ఎంపికై న మున్సిపల్‌ పాఠశాల బృందం2
2/3

జాతీయ స్ధాయికి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు ఎంపికై న మున్సిపల్‌ పాఠశాల బృందం

వరి పంటను పరిశీలిస్తున్న 
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ3
3/3

వరి పంటను పరిశీలిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement