ఈ ఏడాది పత్తిపంట బాగా వస్తుందని ఆశించాం. కానీ కాయలు పండకముందే పా డవుతున్నాయి. కొన్ని కాయ లు బయటకు మామూలుగానే కనిపిస్తున్నా.. లోపల చీల్చి చూస్తే పురుగు కనిపిస్తోంది. మందులు వినియోగించినా పూర్తిగా ఆగడం లేదు.
– సత్యారెడ్డి, రైతు, అయిజ
పత్తి పువ్వులు ముడుచుకుంటున్నాయి. కొని బోళ్లు ముందే తెరుచుకుంటున్నాయి. నూలు కూడా మచ్చలుగా మారుతోంది. ఈ ఒక సమ స్యే కాదు. రెండు సమస్యలు కలిసి వచ్చినట్లు ఉంది. అధికారులు పంట పొ లాలను పరిశీలించి రైతులకు సలహాలు ఇవ్వాలి
– లింగన్న, రైతు, అయిజ
ఉష్ణోగ్రతల్లో మార్పుతో పత్తిపంట ఎరుపు రంగులోకి మారింది. మెగ్నీషియం లోపంతో మరింతగా ఎర్రబారుతుంది. ఈ సమయంలో క్రిమికీటకాలు పంటపై ఎక్కువగా దాడి చేస్తాయి. పంటకు మెగ్నీషియం సల్ఫేట్, అసిపేట్ పిచికారీ చేయాలి. తేలికపాటి తడులు ఇచ్చి.. మొక్కల మొదళ్ల వద్ద నీరు నిలువకుండా చూసుకోవాలి. పుష్కలంగా నీరు ఉన్న రైతులు మాత్రమే ఇవి పాటించాలి. నీరు లేని వారు పంటను వదిలేయాలి. – వీరయ్య,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●


