మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ డిపాజిట్ ఫీజు (మెస్) ను తగ్గించాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీయూ రిజిస్ట్రార్ పి.రమేష్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది బీసీలు బాలురకు రూ.12,100, బాలికలకు రూ.9,100, ఎస్సీ, ఎస్టీలు బాలురకు రూ.11,100, బాలికలకు రూ.9,100, ఓసీలు బాలురకు రూ.18,100, బాలికలకు రూ.16,109 ఉండేదన్నారు. ఈ ఏడాది నుంచి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా బాలురకు రూ.18,000, బాలికలకు రూ.16,100 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇంత మొత్తం చెల్లించలేరని రూ.12 వేలకు తగ్గించాలన్నారు.


