ఇటిక్యాల: రైతులు పంట మార్పిడి విధానం చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. గురువారం ఆయన మండలంలోని సాతర్ల గ్రామ రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాతల అవగాహన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రైతులు తక్కువ కాలవ్యవధిలో పండే పంటలు, కూరగాయల ను సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు విచక్షణ రహితంగా ఎరువులు వాడటం వలన నేల గుళ్లుబారి దిగుబడి తగ్గడమే కాక పెట్టుబడి పెరిగి నేలలు నిస్సారంగా మారుతాయని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువులు వాడాలని అవసరం మేరకు మాత్రమే ఎరువులు ఉపయోగించాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడాలని సూచించారు.
పల్లీ @ రూ.7,811
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్‌కు గురువారం 95 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.7,811, కనిష్టంగా రూ.4,770, సరాసరిగా రూ.6,070 ధరలు లభించాయి.
ఎయిడ్స్‌పై
అవగాహన తప్పనిసరి
కందనూలు: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన తప్పనిసరిగా ఉండాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆయన కార్యాలయంలో నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి గర్భవతికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారికి క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందుల వాడకంపై అవగాహన కల్పించాలని చెప్పారు. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా సిబ్బంది కృషిచేయాలని సూచించారు. హైరిస్క్ గ్రూపులైన ఆటో, లారీ, ట్రక్ డ్రైవర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైన వారికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు.
13న ‘కబడ్డీ’ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 13వ తేదీన ఉదయం 9.30 గంటలకు జిల్లాస్థాయి జూనియర్ బాలు ర, సబ్ జూనియర్ బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చే జూనియర్ బాలురు 05.11.2006 తర్వాత పుట్టినవారై 75 కేజీల లోపు బరువు ఉండాలని, సబ్ జూనియర్ బాలికలు 13.12.2010 తర్వాత పుట్టిన వారై 55కేజీల లోపు బరువు ఉండాలని పేర్కొ న్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ ఒరిజనల్ మెమో, జనన ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈనెల 26 నుంచి 29 వరకు జూనియర్ బాలురు, సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉంటాయని తెలిపారు.
గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్‌లాగ్ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్ కో రా రు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మా ట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ముగించు కుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు.


