అలంపూర్: ఆర్టీసీ మినీ బస్ డిపో నిర్మించాలని హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎమ్మెల్యే విజయుడు గురువారం కలిసి కోరారు. అలంపూర్ నియోజకవర్గంలో రవాణ సౌకర్యం మెరుగుపర్చాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అలంపూర్ చౌరస్తాలో మినీ ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని వినతిలో పేర్కొన్నారు. డిపో పరిధిలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్రోల్ పంపును ఏర్పాటు చేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రికల్ వాహనాలను, చార్జీంగ్ స్టేన్ నిర్మించాలని, అయిజ బస్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని, అలంపూర్ నియోజకవర్గంలో బస్సుల సంఖ్య పెంచి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, విద్యార్థులకు సమయానుకూలంగా బస్సు సర్వీసులు నడిపించాలని విన్నవించగా.. మంత్రి సానుకులంగా స్పందించినట్లు వివరించారు. అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి సాగునీటి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.


