ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తాం

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

శిలాఫలకం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. వివిధ సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ.10 లక్షల వ్యయంతో రోడ్డు ప నులు చేపట్టామన్నారు. ఆస్పత్రిలోని మౌలిక వసుతులు, సదుపాయాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఝాన్సీలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement