గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ స్థలాలు కాదు. అవి పేద విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడాలి. జిల్లా విద్యారంగంలో వెనుకబాటు ఉన్న నేపథ్యంలో గ్రంథాలయాలను బలోపేతం చేయడం చాలా అవసరం.
– యువతేజేశ్వర్ రెడ్డి, గుడిదొడ్డి
పాలకులు దృష్టిపెట్టాలి
ప్రభుత్వం, జిల్లా పరిపాలన, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టిపెట్టాలి. గ్రంథాలయాల అభివృద్ధి చెందేందుకు తవమంతు కృషి చేయాలి. అప్పుడే విద్యార్థులు, నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఉపయోగపడుతాయి.
– మహ్మద్, అయిజ
నివేదిక అందజేస్తాం
గ్రంథాలయాల్లో ఉన్న సమస్యల గురించి ప్రతి సంవత్సరం ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. జిల్లా మెత్తానికి రూ.30 వేలు పుస్తకాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడున్న వనరులు, సదుపాయాలు, అవసరమయ్యే వస్తువులు, నిర్మాణాల గురించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.
– మనోజ్ కుమార్, ఇంచార్జ్ కార్యదర్శి
●


