ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలి

Sep 6 2026 12:49 AM | Updated on Sep 6 2026 12:49 AM

గద్వాల న్యూటౌన్‌: తెలంగాణ ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించాలని ఆ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ షేక్‌ ఫరూఖ్‌ హుస్సేన్‌ అన్నారు. శనివారం స్థానిక హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఎమ్మెల్సీ కోదండరాం అధ్యక్షతన కమిటీ వేయడం హర్షణీయమన్నారు. ఈ కమిటీ ఉద్యమకారులందరికీ న్యాయం చేసే దిశగా పనిచేయాలని కోరారు. నామినేటెడ్‌ పోస్టుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 250 గజాల ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. ఉద్యమకారులకు రూ.25 వేల పెన్షన్‌ అందించాలన్నారు. అనంతరం కమిటీ జిల్లా అధ్యక్షుడిగా అతికూర్‌ రహమాన్‌, ప్రధానకార్యదర్శిగా ప్రభాకర్‌ను నియమించారు. సమావేశంలో నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, భీంసేన్‌రావు, అబ్దుల్‌ రవూఫ్‌, అచ్చన్నగౌడ్‌, ఆంజనేయులు, తాహేర్‌, వినోద్‌, మహమ్మద్‌ రహమతుల్లా, మక్బుల్‌, గోపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement