అలంపూర్: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వసతులు కల్పిస్తోందని డీవైఎస్‌ఓ రామలింగేశ్వరరావు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వైష్ణవి పాఠశాలలో బుధవారం క్రీడా సమాఖ్య జిల్లాస్థాయి వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులు ఆటల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటాలన్నారు. అందుకు ప్రతిభ కలిగిన వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటుందన్నారు. క్రీడల్లో రాణించే వారికి మెరుగైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో కూడా మండల, జిల్లాస్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ నెల 15లోగా మండలస్థాయి, 30వ తేదీలోగా జిల్లాస్థాయి క్రీడలను పూర్తిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు పద్మావతమ్మ, ప్రియదర్శిని, సుహాసిని, శైలజ, భరత్‌కుమార్ ఉన్నారు.
ప్రజా సమస్యలకు
శాశ్వత పరిష్కారం
అలంపూర్: మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాజేశ్ అన్నారు. బుధవారం స్థానిక 2వ వార్డులో ఆయన పర్యటించి.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిలర్ రాజ్యలక్ష్మి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్ స్వాతి, సురేశ్, రజినీబాబు, డేరన్ ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: జిల్లాలో వెన్నెముక సమస్య, కండరాల క్షీణిత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియాతో మంచానికుకే పరిమితమైన వారికి అత్యవసర వైద్యసహాయం కోసం దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జౌషధాల కొనుగోలు, ఎస్కార్ట్ అటెండర్ సహా యం కోసం దరఖాస్తులను కలెక్టరెట్‌లోని మ హిళా శిశుసంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ పత్రాలు, ఆధార్‌తో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, సహా యం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎకై ్సజ్ శాఖలో
భారీగా బదిలీలు
నారాయణపేట: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. సీఐ, ఎస్‌ఐ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ బుధవారం సాయంత్రం నుంచి వరుసగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ ఆమోదంతో గ్రేటర్ హైదరాబాద్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (ఇన్‌చార్జి) హరికృష్ణ ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎకై ్సజ్ పరిధిలోనూ పలువురు అధికారులకు స్థానచలనం కలిగింది. నారాయణపేట ఎకై ్సజ్ సీఐ అనంతయ్య శేరిలింగంపల్లికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్లగొండ డీటీఎఫ్ సీఐ సైదులు వస్తున్నారు.
● నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ ఎస్‌ఐలు గురువయ్య దేవరకొండకు, రమేష్ కోదాడ చెక్‌పోస్టు, శిరీష తుంగతుర్తికి బదిలీ అయ్యారు. కోస్గి సీఐ బాలకృష్ణ మల్కాజ్‌గిరికి బదిలీ కాగా.. నారాయణపేట బీఎంపీపీలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్ సైబరాబాద్ పరిధిలోని పటాన్‌చెరువుకు బదిలీ అయ్యారు.
ఉమ్మడి జిల్లాలో మరికొందరికి..
మహబూబ్‌నగర్ సీఐ లక్ష్మణ్‌గౌడ్ కుత్బుల్లాపూర్‌కు, జడ్చర్ల సీఐ విప్లవ్‌రెడ్డి దూల్‌పేట్‌కు బదిలీ అయ్యారు. నాగర్‌కర్నూల్ పరిధిలోని ఎస్‌ఐ చిన్నరాములు మోటూరి హుజూర్‌నగర్‌కు, జడ్చర్ల ఎస్‌ఐ నాగరాజు ఎన్‌ఫోర్స్‌మెంట్ మల్కాజ్‌గిరికి, కోస్గి ఎస్‌ఐ ఎంఏ జబ్బార్ హయత్‌నగర్, డీటీఎఫ్ నుంచి కవిత సంగారెడ్డికి బదిలీ అయ్యారు.
● రేవులపల్లి నుంచి జి.వెంకటేశం మహబూబ్‌నగర్ సీఐగా, జహీరాబాద్ నుంచి మల్లికార్జునబాబు వనపర్తి సీఐగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి చంద్రశేఖర్ జడ్చర్ల సీఐగా బదిలీపై వస్తున్నారు. మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి ఎస్‌ఐ యాదయ్య జడ్చర్లకు, రామపేట్ నుంచి ఎస్‌ఐ శివకృష్ణ చెక్‌పోస్టుకు, హయత్‌నగర్ నుంచి ఎస్‌ఐ సరళ కోస్గికి బదిలీ వస్తున్నారు. ఘనపూర్ నుంచి నరేష్ కేతావత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మహబూబ్‌నగర్‌కు బదిలీపై వస్తున్నారు.


