గద్వాలన్యూటౌన్: బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ రామేశ్వరమ్మ, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ శంకర్ అన్నారు. బుధవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన చేసి.. ప్రజల హృదయాలు, జీవితాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీటి కొరత తీర్చిన ఘనత మహానేతకే దక్కుతుందని కొనియాడారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యసేవల విస్తరణ, విద్యకు ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్సార్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలతో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోవిందు, సత్యం, నాయకులు తుమ్మల నర్సింహులు, నరహరి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాల శ్రీను, పురుషోత్తంరెడ్డి, గోవిందు, సతీష్, నాగేంద్ర యాదవ్, ధర్మనాయుడు, సుదర్శన్, కౌసర్, కిఫాయత్, శ్రీనివాస్ యాదవ్, మోయిన్, రాజశేఖర్‌రెడ్డి, డీటీడీసీ నర్సింహులు, శ్రీనివాస్‌గౌడ్, ఆనంద్, కృష్ణయ్యగౌడ్, ఆనంద్‌గౌడ్, జహంగీర్, రఫీ, చిన్నమద్దిలేటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు


