మార్గదర్శకాల మేరకు.. | - | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాల మేరకు..

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

కొత్త పింఛన్ల మంజూరులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పెంచింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

– ముషాయిదాబేగం, డీఆర్‌డీఓ

నాలుగేళ్ల నుంచి..

మాది చాలా పేద కుటుంబం. నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పుడు సదరం శిబిరానికి వెళ్లగా వైద్యులు పరీక్షించి, ఏడాది కాల పరిమితితో సర్టిఫికెట్‌ ఇచ్చారు. అయితే అప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో దాని గడువు తీరిపోయింది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నా. మళ్లీ ఈ మధ్యనే మూడేళ్ల కాలపరిమితితో సదరం సర్టిఫికెట్‌ ఇవ్వగా.. దరఖాస్తు చేసుకున్నాను.

– గోవిందు, దివ్యాంగుడు, గద్వాల

వయసు పైబడింది..

నేను చేనేత కార్మికురాలిని. చీరలు నేయడమే మా వృత్తి.. ఇదే మాకు జీవనాధారం. వయస్సు మీదబడటంతో ఎక్కువ చీరలు ఇప్పుడు నేయలేకపోతున్నాను. చేనేత పింఛన్‌కు అర్హురాలిని అయినప్పటికీ కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో రాలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా. ఈసారి వస్తుందని భావిస్తున్నా.

– సుజాత, చేనేత కార్మికురాలు, గద్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement